పగిలిన అద్దంలో ? ఆ అద్దానికి అంటిని రక్తం ఎవరిది? ఎదురుగా పోలీస్ ఆఫీసర్ ఎందుకు ఉన్నారు? లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తుతూ అసలు సిసలు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇలానే ఉంటుందని ‘ఎవరు’ మూవీ ఫస్ట్ లుక్‌తోటే సర్ ప్రైజ్ చేశారు యంగ్ హీరో అడవి శేష్. ‘క్షణం', 'అమీ తుమీ', 'గూఢచారి' వంటి వినూత్న కథాంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎవరు’. కొత్త దర్శకుడు రామ్ జీని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. పీవీపీ సినిమాస్ బ్యానర్‌లో ‘ఎవరు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘క్షణం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అడవి శేష్, పీవీపీ కాంబో మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ రెజీనా కసండ్ర హీరోయిన్‌గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అన్ని కార్యక్రమాలను ముగించుకుని ఆగష్టు 23న ప్రేక్షకుల ముందుకురానుంది ‘ఎవరు’.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xK89Ql
v
No comments:
Post a Comment