Monday, 15 July 2019

దిల్ రాజును మెప్పించిన ఆది-కీర్తి సరేష్ సినిమా

ఆది పినిశెట్టి, జంటగా నటిస్తోన్న సినిమా ఒకటి ప్రముఖ నిర్మాత దిల్ రాజును మెప్పించింది. తనను ఎంతగానో ఆకట్టకున్న ఈ సినిమాను సమర్పించడానికి దిల్ రాజు ముందుకొచ్చారు. ‘హైద‌రాబాద్ బ్లూస్‌’, ‘ఇక్బాల్‌’ వంటి సినిమాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన బాలీవుడ్ డైరెక్టర్ న‌గేశ్ కుకునూర్‌. ఈయ‌న.. కీర్తి సురేశ్‌, , జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. ఇదొక స్పోర్ట్స్ రొమెడీ డ్రామా. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఆగ‌స్ట్‌లో చివ‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల‌కు స‌పోర్ట్ చేసే హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ చిత్రంలో రాహుల్ రామ‌కృష్ణ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వర్త్ ఏ షాట్ మోహన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రావ్య వర్మ సహ నిర్మాత. త్వరలోనే ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2jZkTzt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...