Monday, 15 July 2019

Karthikeya కోసం బ్రహ్మానందం, అలీ.. ‘గుణ 369’ రెండో పాట విడుదల

RX 100 ఫేమ్ కార్తికేయ, అన‌ఘ జంట‌గా నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గుణ 369’. ఆర్.ఎక్స్100 సినిమాతో సెలబ్రిటీగా మారిన కార్తికేయకు ఇదో మూడో సినిమా. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ పతాకాలపై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలోని తొలి పాట ‘తొలి పరిచయమా ఇది.. తొలి పరవశమా ఇది’ని ప్రముఖ నిర్మాత దిల్ ఇటీవల విడుదల చేశారు. తాజాగా హైదరాబాద్‌లో సీనియర్ నటులు, కమెడియన్లు బ్రహ్మానందం, అలీ ఈ సినిమాలోని రెండో పాట ‘బుజ్జి బంగారం’ను సంయుక్తంగా రిలీజ్ చేశారు. ఆడియోతో పాటు సినిమా కూడా సక్సెస్ కావాలని బ్రహ్మానందం ఆకాంక్షించారు. మూవీ యూనిట్‌ను ఆయన ఆశీర్వదించారు. కమెడియన్ అలీ మాట్లాడుతూ.. చైతన్ భరద్వాజ్ కంపోజింగ్ చాలా బాగుందన్నారు. గుణ 369 డైరెక్టర్ తనకు కొలీగ్ అని, తామిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశామని గుర్తుచేసుకున్నారు. ‘ప్రతి ఇంట్లో హోం మినిస్టర్ స్ట్రాంగ్‌గా ఉంటారు. అందుకే నేను కూడా రియల్ లైఫ్‌లో ఆమెను ‘బుజ్జి, బంగారం’ లాంటి పేర్లతో పిలుస్తుంటాను. అదే పదాలతో చేసిన పాట అందరూ పాడుకునేలా ఉంది. ఆర్‌ఎక్స్ 100 మూవీ కన్నా ఈ మూవీ కార్తికేయకు భారీ విజయాన్ని అందించాలని’ అలీ ఆకాంక్షించారు. ఫస్ట్ సాంగ్: ‘తొలి పరిచయమా ఇది.. తొలి పరవశమా ఇది’..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2jVmDcX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...