పూర్తి నగ్నంగా దర్శనం ఇచ్చి ‘ఆమె’ చిత్ర టీజర్‌తో సంచలనం సృష్టించిన వివాదాస్పద నటి మరోసారి తన అసాధారణ ప్రతిభను భయటపెట్టింది. ఆమె లీడ్‌లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ఆడై’ను తెలుగులో ఆమె పేరుతో విడుదల చేస్తున్నారు. ఎమ్.ఆర్ రత్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళ్‌లో ఆడై అంటే ‘డ్రస్’ అని అర్ధం. ఈ టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్‌లో అమలాపాల్ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేస్తూ అందులో అమలాపాల్ పాత్రను రివీల్ చేశారు. బెట్ కట్టే అలవాటు ఉన్న మోడరన్ అమ్మాయిగా.. డేరింగ్ అండ్ డాషింగ్ బిహేవియర్‌తో కనిపిస్తోంది అమలాపాల్. మగాళ్లతో కలిసి మందు, సిగరెట్‌లను ఊదేస్తూ.. ‘మనం పుట్టేటప్పుడు డ్రస్‌తోనా పుడుతున్నాం... మన డ్రెస్ మొత్తం విప్పేస్తే.. మన బాడీనే యాక్యువల్ బర్త్ డ్రెస్’ అంటూ మైమరచిపోతుంది అమలాపాల్. ఇక వెల్కమ్ టు ద వరల్డ్ కామినీ.. అంటూ అహంకారం పూరిత.. బిడియం లేని.. రసవంతమైన విభిన్నపాత్రలతో ‘ఆమె’లో ఏదో విషయం ఉంది అన్నట్టుగా ట్రైలర్‌ను వదిలింది అమలాపాల్. జూలై 19న ‘A’ సర్టిఫికేట్‌తో పెద్దలకు మాత్రమే అని థియేటర్స్‌కి వస్తోంది ‘ఆమె’.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2S47N0j
v
No comments:
Post a Comment