జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరపై హొయలొలికిస్తూ హాట్ యాంకర్‌గా పేరొందిన .. వరుస సినిమాలతోనూ బిజీగా మారింది. బుల్లితెరపై హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్ రేంజ్‌కి ఎదిగిన అనసూయ.. ‘క్షణం’, ‘యాత్ర’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఒకవైపు యాంకరింగ్.. మరోవైపు సినిమాలతో రెండు చేతులా సంపాదిస్తున్న అనసూయ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని ‘తానా’ వేదికగా ప్రకటించారట అనసూయ. అమెరికాలో తెలుగువారి పండుగ తానా సభల్లో పాల్గొన్న అనసూయ తన సన్నిహితుల వద్ద నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలిపారట. నటిగా కంటెంట్ ఉన్న కథల్ని ఎంపిక చేసుకుంటూ టాలెంట్ చేపిస్తున్న అనసూయ.. కంటెంట్ ఓరియెంటెండ్ బేస్డ్ మూవీస్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. త్వరలో ‘అనసూయ పిక్చర్స్’ బ్యానర్‌ని ఏర్పాటు చేసి వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉన్నారట అనసూయ. యాంకర్‌గా రాణించిన అనసూయ.. నటిగానూ ప్రూవ్ చేసుకుంది. ఇక నిర్మాతగానూ సక్సెస్ కావడంలో సందేహాలు అవసరం లేదనే చెప్పాలి. ఎందుకంటే సినిమా ఫ్లేవర్‌ను బాగా ఒంటబట్టించుకున్న అనసూయకు కథల ఎంపికతో పాటు సినిమా ప్రమోషన్స్‌లో కూడా అనుభవం ఉండటం కలిసివచ్చే అంశాలు. ప్రస్తుతం అనసూయ.. ‘కథనం’ చిత్రంలో లీడ్ రోల్‌లో నటిస్తోంది. దీంతో పాటు.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోనూ నటిస్తోంది. ఇవే కాకుండా మరో నాలుగు చిత్రాలను లైన్‌లో పెట్టి బిజీ నటిగా మారింది అనసూయ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LFuarH
v
No comments:
Post a Comment