Wednesday, 10 July 2019

50 మంది మిస్ క్రొయేషియా మోడల్స్.. మధ్యలో ప్రభాస్!

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు ‘సాహో’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి దీనిపై మళ్లింది. ఇండియాలోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హై స్టాండ‌ర్డ్స్, టెక్నాల‌జీతో తెరెకెక్కుతున్న ఈ చిత్రం అగ‌ష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా విడుదలవుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవల వచ్చిన ‘సైకో సైయా’ పాటపై మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది పాట చాలా బాగుందని అంటే, మరికొందరు తెలుగు ప్రాంతీయతకు తగినట్టుగా లేదని అన్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా పాటకైతే మంచి బజ్ వచ్చింది. సోష‌ల్‌ మీడియాలో అయితే ప్రభాస్ అభిమానులు ఈ పాట మీద టిక్‌టాక్‌లు, డ‌బ్‌స్మాష్‌లు చేస్తున్నారు. ఈ సాంగ్ విడుద‌ల‌ కార్యక్రమాన్ని ఐదు నగరాల్లో నాలుగు భాష‌ల్లో రెబ‌ల్‌స్టార్ అభిమానుల‌కి స్పెష‌ల్ స్క్రీనింగ్ చేయ‌టంతో ఫ్యాన్స్‌కి పండ‌గ‌లా అనిపించింది. అదే రోజు హీరోయిన్ శ్రద్ధా క‌పూర్ త‌న సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ సాంగ్‌కి సంబంధించి జిఫ్ ఫైల్ పోస్ట్ చేయ‌టంతో అది బాగా వైర‌ల్ అయ్యింది. ఈ పాటని ఇండోర్ సెట్‌లో చిత్రీక‌రించారు. అలాగే ఈ సినిమాలోని మరో రెండు పాటలను ఆస్ట్రియాలోని అంద‌మైన లోకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. మ‌రో పాట‌ను క్రొయేషియా షూట్ చేశారు. ఈ పాటను 50 మంది మిస్ క్రొయేషియా మోడల్స్‌తో చిత్రీకరించారు. అలాగే, అబుదాబిలో షూట్ చేసిన యాక్షన్ స‌న్నివేశాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశఈ, ప్రమోద్, విక్రమ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అందిస్తోన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రతి సీన్‌ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్‌ను జిబ్రాన్ అందిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ చిత్రంలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేకర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా తదితరులు నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30plWrZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...