లేడీ సూపర్‌స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దాదాపు 13 ఏళ్ల తరవాత మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. హీరోగా నటిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలతో బిజీగా గడిపిన విజయశాంతి ఇప్పుడు సినీ గ్లామర్‌ను మళ్లీ ఆస్వాదిస్తున్నారు. నేడు (జూన్ 24న) విజయశాంతి పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయశాంతికి మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు విజయశాంతి గారు. మీతో మరోసారి కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ ఏడాది మీకు అంతా మంచే జరగాలి’ అని ట్విట్టర్ ద్వారా మహేష్ పేర్కొన్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం నటశేఖర కృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో మహేష్ బాబు నటించారు. అప్పుడు బాలనటుడిగా విజయశాంతితో స్క్రీన్‌ను షేర్ చేసుకున్న మహేష్.. మళ్లీ ఇన్నాళ్లకు ఆమెతో కలిసి నటిస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ (జి మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్), ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2N8yMcw
v
No comments:
Post a Comment