Monday, 24 June 2019

‘వాల్మీకి’ ప్రీ టీజర్.. వామ్మో వరుణ్ కిల్లింగ్ లుక్

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు చూడని లుక్‌లో కనిపించి వరుణ్ అందరినీ ఆశ్చర్యపరిచారు. మొత్తానికి మెగా ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. అయానకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ‘వాల్మీకి’ టైటిల్‌తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ప్రీ టీజర్‌ను విడుదల చేసి ఒక్కసారిగా సినిమాపై హైప్‌ను పెంచేశారు. ఈ ప్రీ టీజర్‌లో వరుణ్ తేజ్ కిల్లింగ్ లుక్‌తో కనిపించారు. ఇప్పటి వరకు వరుణ్ తేజ్‌ను ఇలా చూడలేదు. గుబురు గెడ్డం, మెడలో పులిగోరు, చేతికి తాయెత్తులు, కాళ్లకు పాతకాలపు తోలు చెప్పులు ఇలా వరుణ్ చాలా కొత్తగా కనిపించారు. నిజం చెప్పాలంటే బిహారీ బందిపోటులా ఉన్నారు. కాగా, ఇది తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో ‘వాల్మీకి’ పేరుతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారు. తమిళ నటుడు అథర్వ మురళి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. అయితే, ‘వాల్మీకి’ టైటిల్‌ గతంలో వివాదమైంది. గ్యాంగ్‌స్టర్ మూవీకి వాల్మీకి పేరు ఎలా పెడతారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందే వార్తల్లోకి ఎక్కింది. ఆ తరవాత ఈ ఆందోళన సద్దుమణిగింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2J2wVAt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...