Monday, 24 June 2019

iSmart Shankar: హీరో రామ్ ఇదేం పని..? జరిమానా విధించిన హైదరాబాద్ పోలీసులు

బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం నేరం. ఈ నిబంధనను అతిక్రమించిన రూ.200 ఫైన్ కట్టారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో, రామ్ హీరోగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. గుల్జార్ హౌజ్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా.. షూటింగ్ బ్రేక్‌లో రామ్ దమ్ముకొట్టారు. చార్మినార్ సమీపంలో నిషేధిత ప్రదేశంలో హీరో సిగరెట్ కాల్చుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన చార్మినార్ పోలీసులు హీరోకు రూ.200 జరిమానా విధించారు. హీరోకు జరిమానా విధించిన పోలీసులు చట్టానికి చిన్నా పెద్దా తేడా లేదని నిరూపించారు. హైదరాబాద్ పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో రామ్ పాత బస్తీ కుర్రాడి పాత్రలో కనిపిస్తున్నారు. స్మార్ట్‌గా కనిపించే ఆయన.. ఈ మూవీలో మాస్ లుక్‌లో దర్శనం ఇస్తున్నారు. చిత్ర యూనిట్ ఇటీవలే టీజర్, మూడు పాటలు రిలీజ్ చేసింది. ఈ సినిమా జులై 18న విడుద‌ల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2YiuFvD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...