ప్రముఖ భోజ్‌పురి నటుడు, రాజకీయ నాయకుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా డిఫెన్స్ ఫోర్స్‌లో చేరారు. భారత ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన అగ్నిపథ్ పథకం కింద ఇషిత డిఫెన్స్ ఫోర్స్‌లో భాగమయ్యారు. అగ్నిపథ్ పథకాన్ని ప్రభుత్వం గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్‌సీసీ క్యాడెట్ అయిన తన కుమార్తె రక్షణ దళంలో చేరాలనుకుంటుందని ఈ ఏడాది ప్రారంభంలో రవి కిషన్ ప్రకటించారు. జనవరిలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో తన కూతురు పాల్గొందని.. ఢిల్లీ డైరెక్టరేట్‌లోని 7 గర్ల్స్ బెటాలియన్ క్యాడెట్‌లలో తన కూతురు ఉందని అప్పట్లో రవి కిషన్ తెలిపారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/MxE6S8l
v
No comments:
Post a Comment