మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి ‘వాల్తేరు వీరయ్య’గా దూసుకొచ్చేస్తున్నారు. ఈయనకు తోడుగా మాస్ మహారాజా రవితేజ ఉండటంతో ఇక ఫ్యాన్స్ ఆనందాలకు అడ్డు అదుపు లేకుండా ఉన్నాయి. మెగా మాస్ పూనకాలు కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా జనవరి 8న ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్ ఆర్.కె.బీచ్‌లో ఘనంగా ప్లాన్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే అభిమానుల కోసం స్పెషల్ ట్రెయిన్ కూడా అరెంజ్‌చేసినట్లు సమాచారం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/KNPJBaS
v
No comments:
Post a Comment