తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్‌ను జీఎస్టీ అధికారులు టార్గెట్ చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్టు అనుమానిస్తున్న జీఎస్టీ అధికారులు.. సంస్థ కార్యాలయంలో తనిఖీలు జరిపినట్టు సమాచారం. మంగళవారం ఉదయం నుంచే ఈ తనిఖీలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Jh54qdT
v
No comments:
Post a Comment