బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైంది.. సీపీఐ నారాయణ కూడా సీన్‌లోకి వచ్చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో హోస్ట్ నాగార్జున రాక అయినా లేటు అవుతుందేమో కానీ.. బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైన ప్రతిసారి సీపీఐ నారాయణ వార్తల్లోకి వస్తుంటారు. బిగ్ బాస్ షో అనైతికం, సాంస్కృతిక హీనం, దీని వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలతో పాటు బిగ్ బాస్‌ని బ్రోతల్ హౌస్ అని.. రెడ్ లైట్ ఏరియా అని ఆయన స్థాయిని దిగజార్చుకుని మరీ విరుచుకుపడుతుంటారు నారాయణ. ఇక హోస్ట్ నాగార్జునపైన ఆయన ఫ్యామిలీపైన కూడా నోరు జారారు నారాయణ. ఏ అమ్మాయికి ముద్దుపెడతావ్.. ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావ్.. ఏ అమ్మాయిని పెళ్లాడతావ్ అని ముగ్గురు అమ్మాయిల ఫొటోలు పెట్టి అడుగుతున్నారని.. ఆ ఫొటోలలో నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లని పెట్టొచ్చు కదా అంటూ గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారాయణ.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/ktFMzNa
v
No comments:
Post a Comment