Thursday, 8 September 2022

బిగ్ బాస్‌‌కి వెళ్లి పతీవ్రత అంటే నమ్మను.. వాళ్లు చేసేది అదే** జాఫర్ కూడా అనుభవించాడు.. లైవ్‌లో నారాయణ

బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైంది.. సీపీఐ నారాయణ కూడా సీన్‌లోకి వచ్చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో హోస్ట్ నాగార్జున రాక అయినా లేటు అవుతుందేమో కానీ.. బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైన ప్రతిసారి సీపీఐ నారాయణ వార్తల్లోకి వస్తుంటారు. బిగ్ బాస్ షో అనైతికం, సాంస్కృతిక హీనం, దీని వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలతో పాటు బిగ్ బాస్‌ని బ్రోతల్ హౌస్ అని.. రెడ్ లైట్ ఏరియా అని ఆయన స్థాయిని దిగజార్చుకుని మరీ విరుచుకుపడుతుంటారు నారాయణ. ఇక హోస్ట్ నాగార్జునపైన ఆయన ఫ్యామిలీపైన కూడా నోరు జారారు నారాయణ. ఏ అమ్మాయికి ముద్దుపెడతావ్.. ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావ్.. ఏ అమ్మాయిని పెళ్లాడతావ్ అని ముగ్గురు అమ్మాయిల ఫొటోలు పెట్టి అడుగుతున్నారని.. ఆ ఫొటోలలో నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లని పెట్టొచ్చు కదా అంటూ గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారాయణ.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/ktFMzNa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...