బాలీవుడ్ పర్‌ఫెక్ష్‌నిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha). ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్ ముందుకు రాగా.. మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాలేదు. అద్వైత్ చందన్ (Advait Chandan) డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో. కరీనా కపూర్ (Kareena Kapoor) హీరోయిన్. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలో నటించాడు. ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారేలు సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సమర్పించడం.. నాగార్జున కూడా ఓ చేయి వేసి ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో అంచనాలు నెలకొన్నా.. ఆ అంచనాలు అందుకోలేక బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకురాలు, నటి విజయశాంతి (Vijayashanthi) మరోసారి ఆమిర్ ఖాన్‌పై ఫైర్ అయ్యారు. తమ జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని, అడుగు వేసిన దేశ భక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ రాములమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/i4DB7yf
v
No comments:
Post a Comment