అక్కినేని నట వారసుడిగా.. నాగేశ్వరరావు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నాగార్జున తనదైన ఇమేజ్‌ను సంపాదించుకుని టాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. మాస్, కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ఎక్స్‌పెరిమెంట్స్ కింగ్ అనిపించుకున్నారు. ఎందరో కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసి తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్ అనే ఇమేజ్‌ను దక్కించుకున్నారు. ఆరు పదులు వయసు దాటినా ఇంకా కుర్ర హీరోలతో పోటీ పడే హ్యండ్‌సమ్‌నెస్ ఆయన సొంతం అందుకునే ఆయన్ని టాలీవుడ్ మన్మథుడు అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటుంటారు. ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రాలను అందించాలనుకునే హీరోల్లో నాగ్ ఎప్పుడూ ముందుంటారు. అందుకనే ఆయన కమర్షియల్ సినిమాలతో పాటు భక్తిరస చిత్రాల్లోనూ నటించారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే సినిమాలతో అలరించారు. యూత్‌ని మెప్పించే ప్రేమకథా చిత్రాలు చేసి ఇమేజ్ చట్రంలో ఇరుక్కపోలేదు. అభిమానులను అలరిస్తూనే వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. 1986లో విక్రమ్ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశారు నాగార్జున. కెరీర్ ప్రారంభం నుంచి వైరైటీ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. తండ్రితో కలిసి అగ్నిపుత్రుడు, కలెక్టర్‌గారి అబ్బాయి వంటి చిత్రాల్లో పోటీ పడి నటించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/AlyNSZE
v
No comments:
Post a Comment