అలనాటి స్టార్ హీరోయిన్, సహజ నటి జయసుధ (Jayasudha) గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు అందరి హీరోలతో యాక్ట్ చేసి.. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో తిరులేని నటిగా రాణిస్తున్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఆమె భాగమయ్యారు. ప్రొడ్యూసర్‌గా, రాజకీయ నాయకురాలిగానూ రాణించారు. ప్రస్తుతం అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో నటిస్తూ.. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. జయసుధ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' పాల్గొన్న జయసుధ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా.. కనీసం పూల బోకే కూడా ఎవరూ ఇవ్వలేదన్నారు. అదే వేరే చోట అయితే మరోలా ఉండేదన్నారు. ఇండస్ట్రీలో హీరోలను ఒకలాగా, హీరోయిన్స్‌ను మరోలాగా చూస్తారని అన్నారు జయసుధ. హీరోలకు కంటే వాళ్ల పక్కన ఉన్నవాళ్లే ఓవర్ చేస్తారని.. హీరోలకు డ్యాన్స్‌లు రాకపోతే తమను అనేవారంటూ ఈ సీనియర్ నటి ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇంకా నిర్మాతగా సక్సెస్ కాకపోవడం.. రాజకీయా జీవితం, మా ఎన్నికలు వంటి అనేక విషయాలపై ఓపెన్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె మాటల్లోనే..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/DHhi7j5
v
No comments:
Post a Comment