Monday 7 March 2022

అనుష్క- ప్రభాస్ లవ్ మ్యాటర్.. పెళ్లి గురించి కీలక విషయం చెప్పిన కృష్ణం రాజు భార్య

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ హీరోస్‌లో ప్ర‌భాస్ ఒక‌రు. ఇప్పుడు ఆయ‌న పాన్ ఇండియ‌న్ స్టార్‌. బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ పెళ్లి మాత్రం ఎప్పుడ‌నేది క‌న్‌ఫ‌ర్మ్‌గా ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. ఆయ‌న లేటెస్ట్ మూవీ ‘’ రిలీజ్ సమయంలో తాను అమ్మాయిల విషయంలో వేసుకున్న లెక్కలు ఫెయిల్ అయ్యాయని అందుకనే తనకు పెళ్లి కాలేదేమోనని తనపై తానే జోక్ కూడా వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన సోష‌ల్ మీడియాలో వార్త‌లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్ర‌భాస్‌, పెళ్లి చేసుకుంటార‌నే దానిపై న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. అయితే ఈ వార్త‌ల‌ను ప్ర‌భాస్ పెద్ద‌మ్మ‌.. కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌ల దేవి ఖండించారు. ఇంత‌కీ ఆమె ప్ర‌భాస్ పెళ్లి గురించి ఏమ‌న్నారంటే...‘‘ప్రభాస్‌కి మ‌న సంస్కృతి సంప్ర‌దాయాలంటే ఎంతో గౌర‌వం ఉంది. మ‌హిళంటే గౌర‌వం ఉంది. కుటుంబానికి.. ఇంటి పెద్ద‌ల‌కు గౌర‌వం ఇస్తారు. తప్పకుండా జరుగుతుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఆయ‌న బిజీగా ఉన్నారు ’’ అని తెలిపారు. ఓ న‌టితో ప్ర‌భాస్ ప్రేమ‌లో ఉన్నార‌ని, ఆమెనే పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌లు వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నిస్తే.. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని శ్యామ‌లా దేవి స‌ద‌రు వార్త‌ల‌ను ఖండించారు. ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండ‌స్ట్రీలోని అమ్మాయా.. బ‌య‌ట అమ్మాయా? అని అడిగితే ఏదీ ఇప్పుడే చెప్ప‌లేమ‌ని, అయితే త‌ప్ప‌కుండా ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటార‌ని ఆమె తెలిపారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్‌’. తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌. యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ ల‌వ్ స్టోరి ఇది. మూడు వంద‌ల కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో సినిమాను నిర్మించారు. రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సినిమా రూపొందింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/D2uJaQt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...