Tuesday 1 March 2022

శ్రీముఖిపై బడా ప్రొడ్యూసర్ స్పెషల్ ఇంట్రెస్ట్.. ఏకంగా హీరోయిన్ ఆఫర్!

బుల్లితెర యాంకర్స్ వెండితెరపై సత్తా చాటుతుండటం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. చిన్నితెరపై తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకొని సిల్వర్ స్క్రీన్‌పై రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. మరోవైపు గ్లామరస్ యాంకర్లకు ఆఫర్స్ ఇవ్వడానికి బడా దర్శకనిర్మాతలు సైతం ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ అనసూయ వెండితెరపై సత్తా చాటుతోంది. కాగా, తాజాగా జరిగిన ప్రోగ్రామ్‌లో యాంకర్ శ్రీముఖిపై బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపడం హాట్ టాపిక్ అయింది. నిజామాబాద్ పిల్ల ముందుగా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత యాంకర్‌గా సత్తా చాటుతోంది. అల్లు అర్జున్ నటించిన ‘జులాయి'తో నటిగా కెరీర్‌ స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత ''నేను శైలజ, జెంటిల్‌మెన్, ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ'' లాంటి సినిమాల్లో నటించి పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పుడు మాత్రం చిన్నితెరపై తనదైన యాంకరింగ్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది ఈ రాములమ్మ. అయితే ఆ మధ్య ఇకపై సినిమాలు చేయనంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన శ్రీముఖి ఆ తర్వాత మళ్ళీ యూ టర్న్ తీసుకొని ‘క్రేజీ అంకుల్స్', ‘మాస్ట్రో' సినిమాల్లో భాగమైంది. ఇప్పుడు చిరంజీవి ‘భోళా శంకర్'లో నటిస్తోంది. తాజాగా ఆమె హోస్ట్ చేస్తున్న ‘సరిగమప ద సింగింగ్ సూపర్‌స్టార్' షోకి బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్, యువన్ శంకర్ రాజాలు గెస్టులుగా వచ్చారు. వాళ్లతో కలిసి ఆమె తెగ సందడి చేసిన ఈ బ్యూటీ.. 'సార్.. హీరోయిన్‌గా ఏదైనా ఆఫర్ ఉంటే ఇవ్వండి' అని బోనీ కపూర్‌ని నేరుగా అడిగేసింది. దీంతో శ్రీముఖి కోరిన ఈ కోరికపై ఫన్నీ రియాక్షన్ ఇచ్చాడు ఈ బడా నిర్మాత. ‘సౌత్‌లో నేను హీరోగా చేస్తా. నాకు జోడీగా నిన్ను తీసుకుంటా' అంటూ అందరిముందే కొంటె కామెంట్ చేశారు. దీంతో వెంటనే శ్రీముఖి ఆయనను హగ్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Pm2HZw6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...