Wednesday 2 March 2022

తిరుపతిలో అవి దొరకలేదన్న నటుడు నరేష్.. నెటిజన్ల ట్రోలింగ్

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మాజీ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నెట్టింట్లో విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతుంటాడు. ఆయన మాట్లాడే మాటలు, వేషధారణ మీద సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్ వస్తుంటాయి. మా ఎన్నికల సమయంలో నరేష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తానే చక్రం తిప్పానని, రథసారథిని అంటూ మంచు విష్ణు గెలుపుపై నరేష్ చేసిన కామెంట్లు విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఇక మా ఎన్నికల సమయంలో నరేష్ చేసిన హడావిడి సైతం మీడియాలో బాగానే వైరల్ అయింది. తాజాగా నరేష్ పేరు నెట్టింట్లో ట్రెండ్ అయింది. ఆయన మూడో భార్య చేసిన పనికి, మోసానికి నరేష్ పేరు వార్తల్లో మార్మోగిపోయింది. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవసరమైతే పోలీసులకు సహకరిస్తాను అని నరేష్ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా మరోసారి నెటిజన్లకు నరేష్ దొరికిపోయాడు. తాజాగా అంటే మార్చి 1న నరేష్ తిరుపతికి వెళ్లినట్టున్నాడు. అయితే అక్కడ తనకు కావాల్సిన బ్రాండెడ్ షూస్ కోసం వెతికాడట. తనకు కావాల్సిన నైక్ ఏయిర్ షూస్ మాత్రం దొరకలేదు. గంటలో తిరుపతి అంతా వెతికాడట. ఇక్కడ దొరకడం లేదు హైద్రాబాద్ వెళ్లాల్సిందేనంటూ ట్వీట్ వేశాడు. దీనిపై నెట్టింట్లో విపరీతంగా ట్రోల్ జరుగుతోంది. ఇది కూడా ట్వీట్ వేయడం అవసరమా? గంటలో ఏం తిరిగావ్.. ఎక్కడెక్కడ తిరిగావ్.. మంచు వాళ్లతో కలిసి నువ్ కూడా అలానే తయారయ్యావ్ అంటూ ఇలా నానా రకాలుగా సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి నరేష్ ట్వీట్ మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Sp2de5I
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...