Sunday 6 March 2022

‘భీమ్లా నాయక్’ 9 డేస్ ఏరియా వైజ్‌ కలెక్ష‌న్స్‌.. మ‌రో క్రెడిట్ ఖాతాలో వేసుకోబోతున్న ప‌వ‌ర్‌స్టార్

పవర్ స్టార్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘’. ఆయ‌న‌కు పోటీగా డానియ‌ల్ శేఖ‌ర్ అనే పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి న‌టించారు. ఇద్ద‌రూ పోటా పోటీగా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదే రేంజ్‌లో వ‌సూళ్ల‌ను సాధిస్తుంది. తొలి మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సినిమా సాధించింది. సినిమా విడుద‌లై నేటికి ప‌దవ రోజు. మ‌రి 9 రోజుల్లో ‘భీమ్లా నాయక్’ సినిమాకు వ‌చ్చిన వ‌సూళ్ల వివ‌రాలు ఏంటో చూద్దాం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో..(క‌లెక్ష‌న్స్ కోట్ల‌లో) నైజాం - 33.78 సీడెడ్ - 10.46 ఉత్త‌రాంధ్ర - 7.17 ఈస్ట్ - 5.18 వెస్ట్ - 4.75 గుంటూరు - 4.95 కృష్ణా - 3.52 నెల్లూరు - 2.40 రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి వ‌చ్చిన షేర్ వ‌సూళ్లు రూ. 72. 21 కోట్లు.. గ్రాస్ వ‌సూళ్ల‌లో చూస్తే.. రూ.109.95 కోట్లు క‌ర్ణాట‌క స‌హా రెస్టాఫ్ ఇండియాలో రూ.7.90 కోట్లు వ‌చ్చాయి. ఓవ‌ర్ సీస్‌లో వ‌చ్చిన షేర్ వ‌సూళ్లు రూ.11.85 కోట్లు అంటే మొత్తం క‌లిపి రూ.91.96 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. గ్రాస్ ప్ర‌కారం చూస్తే రూ.149.75 కోట్ల రూపాయలు వచ్చాయి. మ‌రి ఈ నాలుగు రోజుల్లో ‘భీమ్లా నాయక్’ షేర్ క‌లెక్ష‌న్స్ వంద కోట్ల రూపాయ‌ల మార్కును చేరుతుందా? అనేది చూడాలి. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం స‌క్సెస్‌ఫుల్‌గానే ర‌న్ అవుతుంది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాట‌ల‌ను అందించారు. నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/fdicRl9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...