Friday, 4 February 2022

Radhe Shyam: విడుదలకు ముందే నిర్మాతలకు భారీ ప్రాఫిట్స్! ప్రభాస్ రేంజ్ ఇదే మరి..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పైగా చాలా కాలంగా ఈ బాహుబలి స్టార్‌ని వెండితెరపై చూడాలని యావత్ భారతదేశంలోని ఆడియన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆతృత నడుమ ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ సినిమా '' ప్రేక్షకుల ముందుకొస్తోంది. అనివార్య కారణాల వల్ల పలుసార్లు వాయిదాపడ్డ ఈ సినిమాను ఎట్టకేలకు మార్చి 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్‌కి సంబంధించిన ఓ సమాచారం వైరల్ అవుతోంది. విడుదలకు ముందే 'రాధే శ్యామ్' నిర్మాతలకు భారీ లాభాలొచ్చాయనే టాక్ ఫిలిం నగర్ నుంచి వినిపిస్తోంది. 250 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యంత గ్రాండ్‌గా ఈ సినిమాను రూపొందించగా.. ప్రస్తుతం ప్రభాస్‌కి ఉన్న రేంజ్ కారణంగా థియేట్రికల్ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీపడ్డాయట. చివరకు 400 కోట్ల వరకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. దీంతో రిలీజ్‌కి ముందే నిర్మాతలకు లాభాల పంట పండిందని చెప్పుకుంటోంది సినీ లోకం. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీరియాడికల్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించారు. విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడిగా విలక్షణ పాత్రలో కనిపించనున్నారు ప్ర‌భాస్. ఈ సినిమాకు ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద నిర్మాతలుగా వ్యవహరించగా.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు చాలా మంది సంగీత దర్శకులు పని చేయడం విశేషం. ఈ మూవీపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/dAE24iw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...