Friday, 4 February 2022

వచ్చేస్తున్నాం.. ‘మేజర్’ మాటిస్తున్నాడు : అడివిశేష్

క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు వంటి యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న హీరో . ఈయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘మేజ‌ర్‌’. ముంబై ఉగ్ర దాడిలో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌టానికి ప్రాణాల‌ను అర్పించి అమ‌రుడైన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవిత క‌థను, ముంబై దాడిని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిలింస్‌ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. శశి కిరణ్ తిక్క దర్వకత్వం వ‌హిస్తున్న‌ ఈ మూవీ ఒకే సారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మల‌యాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. కోవిడ్ కార‌ణంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మేజ‌ర్ మూవీ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. క‌రోనా థ‌ర్డ్ ప్ర‌భావం త‌గ్గ‌డంతో మేక‌ర్స్ ఇప్ప‌డు వారి సినిమా రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆగ‌స్ట్ 27న మేజ‌ర్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌తో మేజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ఇందులో సందీప్ బాల్యం నుంచి చ‌నిపోయే వ‌ర‌కు ఉన్న కీల‌క ఘ‌ట్టాల‌ను, అలాగే ముంబై అటాక్, మేజర్ వీర మరణం వంటి సన్నివేశాలన్నీ ఇందులో చూపించబోతోన్నారు. శోభితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నటుడిగా, హీరోగా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ అడివి శేష్ టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. మరి మేజర్‌తో పాన్ ఇండియా లెవల్లో శేష్‌కి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గూడఛారికి సీక్వెల్‌గా రూపొందనున్న గూఢచారి 2 సినిమాను త్వరలోనే ప్రారంభించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/u8C3xP7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...