సూపర్‌స్టార్ హీరోగా ప్రముఖ దర్శకుడు, రైటర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ సినిమా పూజా కార్య క్రమాలను జరుపుకుంది. మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సాధారణంగా తన సినిమాలో హీరో హీరోయిన్లనే కాదు.. ఇతర నటీనటుల విషయంలోనూ త్రివిక్రమ్ ఎంతో కేర్ తీసుకుంటారు. అల వైకుంఠపురములో చిత్రాన్ని గమనిస్తే అందులో టబు, జయరామ్ వంటి నటీనటులు మెప్పించారు. ఇప్పుడు త్రివిక్రమ్ మరోసారి తన మార్క్ చూపించడానికి సిద్ధమయ్యారట. ఇప్పటికే సీనియర్ నటి రాధ ఇందులో మహేష్ తల్లి పాత్రలో కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట. అది కూడా ముఖ్యమంత్రి పాత్రలో అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అతడు, ఖలేజా చిత్రాలు తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. ఖలేజా చిత్రం విడుదలై 11 ఏళ్లవుతుంది. చాలా గ్యాప్ తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంపై మంచి అంచచనాలు క్రియేట్ అయ్యాయి. మహర్షి మూవీ తర్వాత మరోసారి మహేష్‌తో జోడీ కడుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ALSO READ : ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ఆయన ఇప్పుడు తన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ మూవీ సమ్మర్ సందర్భంగా మే 12న విడుదలవుతుంది. ALSO READ :
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Oxe9Rdc
v
No comments:
Post a Comment