Wednesday, 16 February 2022

‘భీమ్లా నాయ‌క్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌, ప్లేస్ ఫిక్స్‌..ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కి పండ‌గే!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. రానా ద‌గ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్‌ప్లే అందించ‌డంతో పాటు ఓ పాట‌ను కూడా రాశౄరు. రానున్న శివ రాత్రి సంద‌ర్భంగా ‘భీమ్లా నాయ‌క్‌’ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఆతృత‌గా ‘భీమ్లా నాయ‌క్‌’ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఓ వైపు ‘భీమ్లా నాయ‌క్‌’ రిలీజ్ కోసం స‌న్న‌ద్ధం అవుతుంటే ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ మ‌రో విష‌యం కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత‌కీ అదేంట‌ని అనుకుంటున్నారా? ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం. ‘భీమ్లా నాయ‌క్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తారా? అస‌లు ఉంటుందా? ఉండ‌దా? అనే విష‌యాలపై ఫ్యాన్స్‌లో ఓ చిన్న‌పాటి టెన్ష‌న్ నెల‌కొంది. అయితే సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న లేటెస్ట్ స‌మాచారం మేర‌కు భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించ‌డానికి ఏర్పాటు చేస్తున్నార‌ట‌. ఫిబ్ర‌వ‌రి 21న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తార‌నేది స‌మాచారం. ALSO READ : అయితే ప్ర‌స్తుతం నెల‌కొన్న క‌రోనా ప‌రిస్థితుల్లో ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అటు తెలంగాణ ప్ర‌భుత్వం ‘భీమ్లా నాయ‌క్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఒప్పుకుంటారా? అనేది ఆలోచించాల్సిన విష‌యం. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ ఇది రీమేక్‌. తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు చేర్పులు చేశారు. నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు. స‌ముద్ర ఖ‌ని కీల‌క పాత్ర‌లో న‌టించారు. ALSO READ :


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/V9qMzQO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...