Tuesday, 8 February 2022

మహేష్ బాబు యాడ్ రెవెన్యూ మామూలుగా లేదే..! సూపర్ స్టార్‌ స్ట్రాటెజీ అదుర్స్

ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే యాడ్ షూట్స్ చేస్తూ భారీ రెమ్మ్యూనరేషన్స్ అందుకుంటున్నారు నేటితరం హీరోలు. తమ తమ బ్రాండ్స్ ప్రమోట్ చేసుకునేందుకు కంపెనీలు సైతం హీరోహీరోయిన్లకు భారీ మొత్తం చెల్లిస్తున్నాయి. సినిమాల్లో రెమ్మ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న మహేష్.. కమర్షియల్ యాడ్స్ విషయంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే దాదాపు డజనుకు పైగా బ్రాండ్ల ప్రమోషన్స్ చేపట్టిన సూపర్ స్టార్ ఈ యాడ్స్ ద్వారా భారీ రెవెన్యూ అందుకుంటున్నారట. ఈ క్రమంలోనే తాజాగా కోసం ఆయన భారీ పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్ షూట్‌ని దుబాయ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫా వద్ద షూట్ చేశారు. హిందీలో ఈ యాడ్ హృతిక్ రోషన్ చేయగా.. తెలుగులో మహేష్ ఆ బాధ్యత తీసుకున్నారు. ఈ యాడ్ ప్రమోషన్ కోసం మహేష్ ఏకంగా 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడా ఈ బ్రాండ్‌ ప్రమోషన్ బాధ్యత వహించిన .. అప్పుడు 7 కోట్లు తీసుకొని ఈ సారి 5 కోట్లు అధికంగా తీసుకున్నారట. యాడ్ షూట్స్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా మౌంటెన్ డ్యూ బ్రాండ్ ప్రమోషన్ చేపట్టనున్నారట మహేష్. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటై ఉన్నారు మహేష్ బాబు. అతిత్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Ct76Y0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...