Tuesday, 8 February 2022

లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో షారుఖ్ తీరుపై విమర్శలు.. అసలేం జరిగిందంటే?

లెజెండరీ సింగర్ మరణం యావత్ సినీ లోకాన్ని తీవ్ర వేదనకు గురిచేసింది. ముంబై శివాజీ పార్క్‌లో జరిగిన ఆమె అంత్యక్రియలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు హాజరై శ్రద్థాంజలి ఘటించారు. అయితే లతా అంత్యక్రియలకు వచ్చిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ అక్కడ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. తన మేనేజర్‌తో కలిసి లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చిన షారుఖ్.. ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఆ సమయంలో లతా పాదాల వద్ద ఉదారు షారుఖ్. ఆ వీడియోను హరియాణా ఐటీ ఇన్‌ఛార్జ్‌ అరుణ్‌ యాదవ్‌ షేర్‌ చేసి ‘లతాజీ భౌతికాకాయం దగ్గర ఉమ్ముతారా’ అని కామెంట్‌ పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకొని.. లతా పాదాల దగ్గర షారుఖ్ ఉమ్మేసినట్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ ఇష్యూపై తీవ్ర దుమారం రేగింది. షారుఖ్ ప్రవర్తనను ఎండగడుతూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. లతా మంగేష్కర్ భౌతికకాయం చుట్టూ ఇస్తాం మత పద్దతిలో నమస్కారం చేశారు షారుఖ్ ఖాన్. ప్రార్థన చేసిన తర్వాత నోటి నుంచి గాలి ఊదారు. ఎవరైనా చనిపోయినప్పుడు ప్రార్థనలు చేసి గాలి ఊదడం ముస్లింలలో సాధారణంగా జరుగుతుంది. అయితే షారుఖ్‌పై జరుగుతున్న ట్రోలింగ్ చూసి పలువురు నెటిజన్లు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు షారుఖ్‌కి మద్దతు పలుకుతున్నారు. ఆయన ఉమ్మేయలేదని, భౌతిక కాయం దగ్గర ఊదడం అనేది ఒక ప్రార్థనా విధానం అని తెలుపుతున్నారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని దువా చదివి ఇలా గాలి ఊదుతారని చెబుతున్నారు. అసలు విషయం తెలుసుకోకుండా అరుణ్‌ యాదవ్‌ ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైన పద్దతి కాదని, తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవాలి తప్ప ఇలా పబ్లిక్‌గా ట్వీట్స్ పెట్టడం సరికాదని పలువురు జనం మండిపడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/YlcAmk0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...