Thursday, 17 February 2022

ప్రభాస్ దూకుడు మామూలుగా లేదే! పాన్ ఇండియా స్టార్ మరో స్టెప్..

'బాహుబలి' సినిమాతో తన క్రేజ్ ఎల్లలు దాటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అవన్నీ కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది. ఇక వరుస ప్రాజెక్ట్స్‌తో దేశవ్యాప్తంగా థియేటర్స్ దద్దరిల్లుతాయని అంటున్నారు అభిమానులు. అయితే ఇవన్నీ ఇలా ఉండగానే మరో ప్రాజెక్టును కూడా లైన్ లోకి తీసుకొస్తున్నారట ప్రభాస్. తాజాగా ఇందుకు సంబంధించిన సమాచారం వైరల్ అవుతోంది. ఇప్పటికే ప్రభాస్ చేసిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు ‘ఆది పురుష్’ మూవీ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కి రెడీ అవుతోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శాకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఇంత బిజీ షెడ్యూల్ నడుమ కూడా డైరెక్టర్ మారుతికి డేట్స్ ఇచ్చారట ప్రభాస్. ప్రభాస్- కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రాబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. దీని కోసం ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌ కూడా రిజిస్టర్ చేయించారని, హారర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా రూపొందనుందని వార్తలొస్తున్నాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీ షూటింగ్ కోసం ప్రభాస్ డేట్స్ తీసుకొని డైరెక్టర్ మారుతి ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు. తనదైన స్టైల్‌లో ఈ సినిమాను చకచకా ఫినిష్ చేసేలా ప్లాన్ సిద్ధం చేసుకున్నారట మారుతి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/L3TExNn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...