Thursday, 17 February 2022

మీరా జాస్మిన్ రీ- ఎంట్రీ కన్ఫర్మ్! బోయపాటి పర్ఫెక్ట్ ప్లాన్

ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్లు తిరిగి సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చి రాణిస్తుండటం చూస్తున్నాం. ఒకానొక సమయంలో వెండితెరపై హవా నడిపించిన హీరోయిన్స్ ఇప్పుడు తమకు యాప్ట్ అయ్యే పాత్రలతో కెమెరా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మీరా కోసం మాస్ డైరెక్టర్ పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేశారట. ఆయన సినిమాతోనే ఆమె తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ‘అమ్మాయి బాగుంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మీరా జాస్మిన్.. ఆ తర్వాత ''భద్ర, గుడుంబా శంకర్'' లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసింది. ఈ సక్సెస్‌తో ఆమెకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. అయితే చివరగా గొరింటాకు సినిమాలో రాజశేఖర్‌ చెల్లెలి పాత్రలో కనిపించిన మీరా.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కెమెరాకు దూరమైంది. నటనకు బ్రేక్ ఇవ్వడంతో ఇక మీరా తన కెరీర్‌కి గుడ్ బై చెప్పినట్లే అని అంతా ఫిక్సయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తన లేటెస్ట్ లుక్స్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హవా నడిపించడం షురూ చేసింది మీరా. దీంతో ఆమె సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె నటించబోయే తెలుగు సినిమాపై ఓ సమాచారం వైరల్ అవుతోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో భాగం కానుందని తెలుస్తోంది. రామ్‌, బోయపాటి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం నటీనటులు ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో హీరో అక్క పాత్ర కోసం మీరా జాస్మిన్‌ను సంప్రదించినట్లు సమాచారం. బోయపాటి చెప్పిన కథ, తనకు ఇచ్చే రోల్ నచ్చడంతో ఈ సినిమాలో నటించేందుకు మీరా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సో.. చూడాలి మరి మీరా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/kL3Coi4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...