Saturday, 5 February 2022

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత

ప్రముఖ సీనియర్ గాయ‌ని ఆదివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిట‌ల్‌లో క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 92 సంవ‌త్స‌రాలు. కోవిడ్ సోక‌డంతో ఆమెను జనవరి 8న కుటుంబ స‌భ్యులు హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. 29 రోజులుగా ఆమె హాస్పిట‌ల్‌లోనే చికిత్స తీసుకున్నారు. అంతా కోలుకున్నార‌ని భావించిన త‌రుణంలో శ‌నివారం మ‌ళ్లీ ఆమె ఆరోగ్యం క్షీణించింద‌ని, ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్ట‌ర్ ప్ర‌తిత్ సందాని తెలిపారు. అయితే ప‌రిస్థితి చేయి దాట‌డంతో ఆమె ఆదివారం ప‌ర‌మ‌ప‌దించారు. 1942లో లతా మంగేష్కర్ గాయనిగా కెరీర్‌ను ప్రారంభించారు. 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ ఆమె పాటలు ప్రేక్షకులను ఆనందింప చేస్తూనే ఉన్నాయి. ఆమె లేరనే వార్త సినీ ప్రేమికులను, సంగీతాభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. గాన కోకిలగా పేరు పొందిన లతా మంగేష్క‌ర్‌కు 2001వ సంవత్సరంలో భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న దక్కింది. లతా మంగేష్కర్‌ను నైటింగేల్ ఆఫ్ ఇండియాగా కీర్తిస్తుంటారు. దేశ, విదేశ పాటలెన్నో ఆమె ఆలపించారు. లతా మంగేష్కర్ జనవరి 8న కోవిడ్ బారిన పడటంతో కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేర్చారు. డాక్టర్ ప్రతిత్ సందాని నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్స‌లు అందించింది. ఆరోగ్యం మెరుగు ప‌డింది. జ‌న‌వ‌రి 30న కూడా మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేష్ తోపే లతా మంగేష్క‌ర్ ఆరోగ్యం మెరుగ‌వుతుంద‌ని, ఆమె క‌రోనా, నిమోనియా నుంచి కోలుకున్నార‌ని కాస్త బ‌ల‌హీనంగా ఉన్నారే కానీ త్వ‌ర‌గానే కోలుకుంటార‌ని ఆయ‌న తెలియ‌జేసిన సంగ‌తి విదితమే. కానీ ఆమె మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/N7sWBDl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...