Saturday, 5 February 2022

మరోసారి విలన్‌గా అనసూయ... ఈసారి విలనిజం అంతకు మించి అంటున్న ముద్దుగుమ్మ!

జ‌బ‌ర్ద‌స్త్ హాట్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న అన‌సూయ భ‌ర‌ద్వాజ్ వెండితెర‌పై అడుగు పెట్టిన త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ బిజీ న‌టిగా మారింది. పాజిటివ్ పాత్ర‌ల్లోనే కాదు, నెగిటివ్ పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ అంద‌రినీ మెప్పిస్తుంది. క్ష‌ణం చిత్రంలో గ్రే షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించారు. త‌ర్వాత రీసెంట్‌గా విడుద‌లైన పుష్ప ది రైజ్ చిత్రంలో దాక్షాయ‌ణి అనే పాత్ర‌లో గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌లో మ‌రోసారి అన‌సూయ మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ పాత్ర కోసం ఆమె మేకోవర్ అయిన తీరు ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంది. ఆమె జ‌ర్దా న‌ములుతుండ‌టం.. భ‌ర్త పాత్ర‌లో న‌టించిన సునీల్‌పై బ్లేడుతో దాడి చేయడం వంటి స‌న్నివేశాల్లో అన‌సూయ న‌ట‌న అల‌రించింది. న‌టిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న అనసూయ మరోసారి నెగటివ్ టచ్ ఉన్న పాత్ర‌లో కనిపించబోతున్నారు. వివరాల్లోకి వెళితే, ఓ డెబ్యూ డైరెక్ట‌ర్ చేస్తున్న సినిమాలో అన‌సూయ న‌టించ‌డానికి ఒప్పుకున్నారు. అది కూడా గ్రే షేడ్స్ క్యారెక్ట‌ర్‌. ఆ సినిమా పేరు ద‌ర్జా. ఇందులో కూడా న‌టిస్తుండ‌టం విశేషం. పుష్ప ది రైజ్‌లో భార్య‌, భ‌ర్త‌గా న‌టించిన అన‌సూయ‌, సునీల్ ఈసారి మాత్రం పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. మ‌రి ఈ కొత్త సినిమా ద‌ర్జా అన‌సూయ‌కు ఎలాంటి గుర్తింపు తెస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక అన‌సూయ టీవీ, సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్నారు. త‌న సీరియ‌ల్స్‌, సినిమాలు, భ‌ర్త‌, పిల్ల‌లు ఫొటోలు, వీడియోల‌ను కూడా ఆమె షేర్ చేస్తుంటారు. నెటిజ‌న్స్ వేసే ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో రియాక్ట్ కూడా అవుతుంటారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/AhaIYKB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...