Monday, 21 February 2022

బాలయ్య బాబుతో ఓ సంచలనం క్రియేట్ చేస్తా! టాలీవుడ్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు . ఇక అదే జోష్‌లో వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. అయితే బాలకృష్ణతో సినిమా ఉండబోతోందని ఎప్పటి నుంచో వింటున్నాం. తాజాగా ఈ విషయమై డైరెక్టర్ అనిల్ రావిపూడి రియాక్ట్ అయ్యారు. తాను బాలకృష్ణతో చేయబోయే సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పారు. ఇంతవరకూ బాలకృష్ణ గారు చేసిన సినిమాలకి భిన్నమైన రోల్‌లో ఆయన్ను చూపిస్తామని, ఈ మేరకు త్వరలోనే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలెడతానని అన్నారు. అంతేకాదు బాలకృష్ణ గారితో తాను చేయబోయే సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం కావడం ఖాయమని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్న అనిల్.. ఈ సినిమా పూర్తికాగానే బాలకృష్ణ మూవీని లైన్‌లో పెట్టబోతున్నారట. మరోవైపు బాలకృష్ణ సైతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్య అభిమానుల కోసం మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన పదునైన కథ సిద్ధం చేసుకున్న గోపీచంద్ మలినేని.. ఈ సినిమాలో ఆయనను చాలా పవర్‌ఫుల్ రోల్స్‌లో చూపించబోతున్నారని టాక్. ఇందులో బాలయ్య బాబు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారట. ఈ మూవీ కోసం 'రౌడీయిజం' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది. ఈ మూవీ కంప్లీట్ కాగానే అనిల్ రావిపూడితో ఉంటుందని బాలకృష్ణ ఇదివరకే కన్ఫర్మ్ చేశారు. సో.. లెక్కన చూస్తే రాబోయే రోజుల్లో బాలయ్య మాస్ జాతరకు థియేటర్స్ హోరెత్తడం పక్కా అని తెలుస్తోంది కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/BPDXRYU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...