Thursday, 10 February 2022

విమానంలో మహేష్‌కి పెళ్లి రోజు అభినంద‌న‌లు చెప్పిన చిరు, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి, కొర‌టాల‌!

గురువారం (ఫిబ్ర‌వ‌రి 10) సూప‌ర్ స్టార్ మ‌హేష్ జీవితంలో మ‌ర‌పురాని రోజు.. ఆయ‌న పెళ్లి రోజు. హీరోయిన్ న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌తో మ‌హేష్ ఏడ‌డుగులు వేసిన రోజుది. 2005, ఫిబ్ర‌వ‌రి 10న మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లి జ‌రిగింది. 17 సంవత్స‌రాలు అవుతున్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ వంటి త‌దిత‌రులు మ‌హేష్‌కి అభినంద‌న‌లు తెలిపారు. ఇంత‌కీ వారు ఎక్క‌డ అభినంద‌న‌లు చెప్పారో తెలుసా విమానంలో. అదేంటి? అంద‌రికీ విమానంలో ఏం ప‌ని అనుకుంటున్నారా? అదేనండి బాబు.. ఈరోజు (ఫిబ్ర‌వ‌రి 10) వీరంద‌రూ క‌లిసి సినీ ప‌రిశ్ర‌మ‌లోని స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి గ‌న్న‌వ‌రం చేరుకున్నారు. అక్క‌డ నుంచి ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి వెళ్లారు. ఈ క్ర‌మంలో ఎయిర్ పోర్టులో క‌లుసుకున్న మ‌హేష్‌కి అక్క‌డున్న సినీ సెల‌బ్రిటీలంద‌రూ అభినంద‌న‌లు తెలిపారు. చిరంజీవి ఓ పుష్ప గుచ్చాన్ని అందించి అభినంద‌న‌లు తెలిపారు. స‌ద‌రు ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. గురువారం మ‌హేష్ కూడా త‌న ఇన్‌స్టాలో న‌మ్ర‌త‌, గౌత‌మ్‌, సితార‌ల‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీంతో పాటు న‌మ్ర‌త‌కు పెళ్లి రోజు అభినంద‌న‌లు కూడా తెలిపారు. ఆ ఫొటో కూడా నెట్టింట వైర‌ల్ అవుతుంది. సినిమా రంగానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడటానికి వై.ఎస్.జగన్ టాలీవుడ్ నుంచి కొంత మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని.. వై.ఎస్‌.జ‌గ‌న్‌తో మీటింగ్‌కు కావాల్సిన ఏర్పాట్ల‌ను చేశారు. హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో గన్నరం ఎయిర్ పోర్టుకి చేరుకుని అక్క‌డ నుంచి తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి చేరుకోబోతున్నారు. సినిమా టికెట్ ధ‌ర‌ల‌తో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఇత‌ర స‌మ‌స్య‌లు గురించి కూడా సినీ ప్ర‌ముఖులు సీంతో మాట్లాడే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/QNYUKFr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...