Wednesday, 19 January 2022

HBD VarunTej: పవర్ చూపించిన మెగా హీరో.. వీడియో వైరల్

మెగా బ్రదర్ నాగబాబు తనయుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు. విలక్షణ పాత్రలతో మెప్పిస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా ట్రాన్స్‌ఫామ్ అవుతున్నాడు. ఇప్పటివరకు లవ్‌ స్టోరీలతో యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసిన వరుణ్.. ఇప్పుడు మాస్ అప్పీయరెన్స్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో '' అనే సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే ఎప్పటికప్పుడు 'గని' సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు మేకర్స్. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫైనల్‌గా మార్చి 18వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టిన యూనిట్ నేడు (జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా ఓ వీడియో రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్‌కి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ 'పవర్ ఆఫ్ గని' పేరుతో ఓ వీడియో విడుదల చేసి మెగా అభిమానులను ఖుషీ చేశారు. ఈ వీడియోలో హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ వరుణ్ తేజ్ పవర్ ప్యాక్ లుక్, బాక్సింగ్ కిక్ చూపించారు. ఈ సినిమాలో ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్న వరుణ్ తేజ్.. ఈ పాత్ర కోసం స్పెషల్‌గా మేకోవర్ అయ్యాడు. తన రోల్ రియాలిటీ దగ్గరగా ఉండాలని బాక్సింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకొని షూటింగ్‌లో పాల్గొన్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33NIhGw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...