Tuesday, 18 January 2022

సుకుమార్‌తో విజయ్ దేవరకొండ సినిమా.. రౌడీ స్టార్ బిగ్ డీల్!

కెరీర్ ఆరంభం నుంచే వైవిద్యభరితమైన కథలతో ముందుకెళ్తున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమాతో వచ్చిన క్రేజ్‌ని 'గీత గోవిందం' మూవీతో అమాంతం పెంచుకున్న ఆయన.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నారు. దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సినిమా గురించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. విజయ్ తాజా సినిమా 'లైగర్' కోసం గతంలో ఎప్పుడూ లేనంతగా అత్యధిక పారితోషికం అందుకోబోతున్నారని, లేదు లేదు ఈ సినిమా లాభాల్లో వాటా తీసుకునే అవకాశం ఉందనే సమాచారాలు తెగ షికారు చేస్తున్నాయి. మొత్తంగా లైగర్ ద్వారా విజయ్ దేవరకొండకు దాదాపు 20 కోట్లకు పైగా ముట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే సుకుమార్‌తో ఆయన చేయబోతున్న ఫ్యూచర్ ప్రాజెక్టు విషయంలో ఇది రెట్టింపు కానుందట. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేసేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'రాంపేజ్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. భారీ బడ్జెట్ కేటాయించి అన్ని హంగులతో రూపొందించనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమాకు రెమ్మ్యూనరేషన్ తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా పంచుకునేలా విజయ్ దేవరకొండ అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవలే పుష్ప సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న సుకుమార్.. ఈ సినిమా రెండో భాగాన్ని రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. మరికొద్ది రోజుల్లో పుష్ప-2 సెట్స్ మీదకు రానుంది. ఈ మూవీ ఫినిష్ అయ్యాక సుకుమార్- విజయ్ దేవరకొండ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GKZoY8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...