భరద్వాజ్ గురువారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేశారు. బంగార్రాజు సినిమాకు అనసూయకు ఎలాంటి సంబంధం లేదు. అందులో అనసూయ ఎలాంటి పాత్రను పోషించలేదు.కానీ బంగార్రాజు ఈవెంట్‌కు వచ్చేశారు. అయితే బంగార్రాజు సినిమాకు ఎలాంటా సంబంధం లేకున్నా.. రాము బావా అంటూ సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బుజ్జిగా అనసూయ అదరగొట్టేసింది. అయితే బంగార్రాజు సినిమాలో తనకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు.. తనను ఎందుకు పెట్టుకోలేదని స్టేజ్ మీదే దర్శకుడిని నిలదీసింది. అయితే తనకు చెప్పిన కారణమే ఇప్పుడు కూడా అందరి ముందు చెప్పమని దర్శకుడికి ఆర్డర్ వేసింది. అయితే చిన్న బంగార్రాజుకు పిన్ని పాత్ర అవుతుంది.. ఏజ్ ఎక్కువగా చూపించాల్సి వస్తుందని.. అలాంటి పాత్ర చేస్తారా? అని వద్దన్నాను అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. తన వద్ద మాత్రం కళ్యాణ్ కృష్ణ వేరే కారణం చెప్పాడని, ముసలి పాత్రను ఎందుకులే.. నీ కోసం సపరేట్‌గా బుజ్జి అనే వెబ్ సిరీస్ చేద్దామని బిస్కెట్ వేశాడు. అంత పెద్ద బిస్కెట్ ఎవరైనా వేస్తారా? అంటూ సందడి చేశారు. ఏడవ్వలేక ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాను.. ఈ సినిమాలో నన్ను ఎందుకు పెట్టుకోలేదు అని ఎప్పుడూ అడుగుతూనే ఉంటాను. నీ కల్లోకి కూడా వస్తాను అంటూ దర్శకుడిని ఆడుకున్నారు అనసూయ. అయితే సినిమా మీద అనసూయ పాజిటివ్ కామెంట్లు చేసింది. సినిమా ట్రైలర్‌ను నాలుగైదు సార్లు చూశాను. అంటే తనివి తీరా చూశానన్నమాట. నాగ్ సర్, నాగ చైతన్య ఇలా ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడటం బాగుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు అనసూయ చెప్పుకొచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3K8ccKr
v
No comments:
Post a Comment