Friday, 14 January 2022

హీరోయిన్‌తో స్టేజ్ మీద చైతూ చిలిపి చేష్టలు.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

మ్యూజికల్ నైట్ ఈవెంట్‌లో నాగ చైతన్య, నగార్కర్ చిలిపి చేష్టలు బయటపడ్డ సంగతి తెలిసిందే. స్పీచ్ ఇస్తున్న సమయంలో మధ్యలో వెనక్కి తిరిగి హీరోయిన్‌ను ఓరకంటగా చూడటం.. ఆ వెంటనే హీరోయిన్ కళ్లు ఎగరేయడం, చైతూ సిగ్గుపడి తలను కిందకి దించుకోడం అందరికీ తెలిసిందే. ఆ వీడియో నెట్టింట్లో మీమర్స్, ట్రోలర్స్‌కు మంచి ఆహారంగా మారింది. రకరకాల ట్రోల్స్, మీమ్స్‌తో నాగ చైతన్యను ఆడుకున్నారు. నాగ చైతన్యలోనూ మంచి రసికుడున్నాడు.. ఎంతైనా కింగ్ నాగ్ కొడుకు కదా? ఆ సరసాలు, చేష్టలు ఎక్కడికిపోతాయ్ అని కౌంటర్లు వేశారు. అయితే ఈ వీడియో మీద దర్శకుడు స్పందించాడు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ నాగ చైతన్య స్వభావం గురించి చెప్పుకొచ్చాడు. చై బంగారం. చైతూని అందరూ బంగారం ఎందుకు అని అంటారో ఆయనతో పని చేశాక తెలుస్తుంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను చేశాను. ఇప్పుడు బంగార్రాజు చేశాను. 24 కారెట్స్ కాస్త 48 కారెట్స్ అయింది. ఈ నాలుగేళ్లలో అతనిలో చాలా మార్పులు వచ్చాయి. మాట్లాడే పద్దతి, నటన, మెచ్యూరిటీలో మార్పులు వచ్చాయి. చైలో ఉన్న క్లారిటీ మనకు పది శాతం ఉంటే.. హ్యాపీగా బతికేయోచ్చు. ఈ సినిమా వల్ల ప్రతీ రోజు సెట్‌లో కలిశాం. చై సైలెంట్ అని అనిపిస్తుంది. కానీ అంత సైలెంట్ కాదు. ఓపెన్ అప్ ఎంజాయ్ చేస్తే నవ్వు ఎంతో ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇంత వరకు రాముడి పాత్రలు చేస్తే ఇప్పుడు చేసింది కృష్ణుడు కారెక్టర్. మొన్న జరిగిన ఈవెంట్‌లో నాగార్జున గారు మాట్లాడుతున్నారు. ఏదో సౌండ్ అయిందని వెనక్కి తిరిగి చూశాడు. అలా వెనక్కి తిరగడంతో దక్ష కళ్లు ఎగరేసింది. నాగ చైతన్య సిగ్గు పడ్డాడు. ఆయన సిగ్గు పడటం కామన్. ఆయన ఎవరిని చూసినా అలానే నవ్వుతాడు. అదంతా ఆమె వల్ల జరిగింది అంటూ అసలు విషయాన్ని చెప్పేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33lnt9v
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...