Wednesday, 12 January 2022

మహేష్ బాబు మేనల్లుడికి రామ్ చరణ్ సపోర్ట్.. అప్పుడలా.. ఇప్పుడిలా!

టాలీవుడ్‌‌కి మరో 'హీరో' పరిచయం కాబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ రంగంలోకి దిగుతున్నాడు. బావ, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ గ‌ల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గ‌ల్లా హీరో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. మహేష్ బాబు మొదలుకొని పలువురు సినీ ప్రముఖులు ఈ హీరోకు సపోర్ట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా పవర్ స్టార్ ముందుకొచ్చారు. జనవరి 15న హీరో సినిమాను రిలీజ్ చేస్తున్న సందర్భంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు యూనిట్ సభ్యులు. జనవరి 13న జరగబోతున్న ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. గతంలో కూడా ఈ హీరో మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు రామ్‌చ‌ర‌ణ్. మళ్ళీ ఇప్పుడు సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుకకు గెస్టుగా వస్తూ రామ్ చేస్తున్న ఈ సపోర్ట్‌పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, వెన్నెల కిషోర్‌, నరేష్‌, బ్రహ్మానందం, సత్య, అర్చన సౌందర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nfe7D2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...