Monday, 17 January 2022

తండ్రి సీక్రెట్స్ బయట పెట్టేసిన నాగ చైతన్య.. !

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరోల్లో ఒక‌రు. ఈయ‌న హీరోగా కొడుకు నాగ చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన లేటెస్ట్ మూవీ ‘’. ఈ సంక్రాంతికి విడుద‌లైన ఆ సినిమా మూడు రోజుల్లోనే మంచి వ‌సూళ్ల‌ను సాధించి సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా విష‌యంలో నాగార్జున పెట్టుకున్న న‌మ్మ‌కం మ‌రోసారి నిజ‌మైంది. ఈ సినిమాకు ప్ర‌మోష‌న్స్ ప‌రంగానూ నాగార్జున, నాగ చైత‌న్య‌ టాలీవుడ్ మీడియాతో పాటు బాలీవుడ్ మీడియాకు కూడా ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన రీసెంట్ ఇంట‌ర్వ్యూలో నాగ చైత‌న్య ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. నాగార్జున అక్కినేనికి కోపం రావాలంటే ఏం చేయాలి? అని ప్ర‌శ్నించిన‌ప్పుడు నాగ చైత‌న్య మాట్లాడుతూ ‘‘నాన్నకు ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం జరగాలి. చివరి నిమిషంలో ప్లాన్ మార్చితే ఆయ‌న‌కు కోపం వ‌స్తుంది’’ అన్నారు. మ‌రి నాగ్‌కి కోపం పోవాలంటే ఏం చేయాలి? అని అంటే నాగ చైత‌న్య స్పందిస్తూ ‘‘నాన్నకు మంచి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మన ఇండియన్ ఫుడ్‌లో ఆయ‌న బిర్యానీని బాగా ఇష్ట‌ప‌డ‌తారు. హైద‌రాబాద్‌లో ఓ మ‌హిళ బిర్యానీని చ‌క్క‌గా చేస్తారు. ఆవిడ పేరు నాకు తెలియ‌దు. నాన్న ఎప్పుడు బిర్యానీ తినాల‌ని అనుకున్నా.. ఆవిడ ద‌గ్గ‌ర నుంచి తెప్పించుకుని తింటారు’’ అన్నారు. ఇలా చైత‌న్య స‌ద‌రు ఇంట‌ర్వ్యూలో నాగార్జున‌కు సంబంధించిన సీక్రెట్స్ బ‌య‌ట పెట్టేశారు. అయితే నాగ చైత‌న్య చెప్ప‌లేని విష‌యం ఏంటంటే.. అస‌లు నాగార్జున ఇష్టంగా తినే బిర్యానీని వండి పెట్టే మ‌హిళ ఎవ‌రా? అని తెలియ‌డం లేదు. ఆమె ఎవ‌రా? బిర్యానీ ఎంత చ‌క్క‌గా వండుతుంది? అని అక్కినేని అభిమానులు ఫ్యాన్స్ ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారట‌. మనం సినిమా తర్వాత నాగార్జున, కలిసి నటించిన చిత్రం బంగార్రాజు. సొగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ఇది సీక్వెల్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. నాగార్జున జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్య జోడీగా కృతి శెట్టి నటించింది. నాగార్జున ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమా చేస్తున్నారు. మరో వైపు నాగ చైతన్య థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలను పూర్తి చేసి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3A98dIL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...