గత వారం రోజుల క్రితం యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని హీరోయిన్ స్వయంగా ఆమెనే వెల్లడించారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని, అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నానని పేర్కొన్నారు. అలా దాదాపు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న కీర్తి తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. తనకు వచ్చిందని తెలుపుతూ ట్వీట్ పెట్టారు కీర్తి. ఈ రోజుల్లో 'నెగెటివ్' అంటే పాజిటివ్ విషయం. నాపై మీ అందరు చూపించిన ప్రేమ, ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. అందరూ సంక్రాంతి పండగ రోజులను ఆనందంగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్న కీర్తి సురేష్.. క్వారంటైన్ తర్వాత తన లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేశారు. దీంతో ఈ గుడ్ న్యూస్ విన్న నెటిజన్స్ ఆమె షేర్ చేసిన ఫొటోలపై లైకులు కురిపిస్తున్నారు. 'మహానటి' సినిమాతో టాలీవుడ్‌లో కీర్తి సురేష్ క్రేజ్ అందలమెక్కింది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. ఆ తర్వాత అవకాశాల పరంగా దూసుకుపోతున్న కీర్తి.. ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి రోల్ అబ్బురపరచనుందట. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'భోళా శంకర్' సినిమాలో భాగమవుతున్నారు కీర్తి. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా ఆమె కనిపించనుండటం విశేషం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fAV9Cx
v
No comments:
Post a Comment