Thursday, 20 January 2022

హీరో దుల్కర్ సల్మాన్‌కి కరోనా పాజిటివ్

సినిమా ఇండస్ట్రీని కరోనా కష్టాలు వీడటం లేదు. ఈ మహమ్మారి బారిన పడుతున్న సినీ సెలబ్రిటీల లిస్ట్ అంతకంతకూ పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇటీవలే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి అని తేలగా ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన కుమారుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి కూడా కరోనా సోకింది. పాజిటివ్ అని తేలడంతో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొద్దిపాటి జలుబు ఉండటంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నానని, తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఈ మధ్య కాలంలో షూటింగ్స్‌లో తనతో కలిసిన వాళ్లంతా జాగ్రత్తగా ఉండండని, ఏ మాత్రం లక్షణాలు కనిపించినా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండని పేర్కొన్నారు. ఈ పాండమిక్ ఇంకా పూర్తికాలేదు.. అందరూ మాస్క్ ధరించండి.. సేఫ్‌‌గా ఉండండి అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు దుల్కర్. కేవలం వారం రోజుల గ్యాప్ లోనే తండ్రీ కొడుకులకు కరోనా సోకడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్లు పెడుతున్నారు. మళయాళ చిత్ర పరిశ్రమలో యువ హీరోగా దుల్కర్ సల్మాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువవుతున్నారు. తెలుగులో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘మహానటి’ సినిమాలో దుల్కర్ పోషించిన పాత్ర ఆయన్ను టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nMgeyp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...