Saturday, 4 December 2021

అప్పుడు ‘అద్భుతం’ ఇప్పుడు WWW.. మళ్లీ ఓటీటీకి శివానీ రాజశేఖర్

యాంగ్రీమెన్ రాజ శేఖర్ కూతురిగా అద్భుతంగా, భారీ స్థాయిలో తెరపై ఎంట్రీ ఇవ్వాలని చూసింది. కానీ శివానీ రాజశేఖర్ సినిమాలు ఇప్పుడు ఓటీటీ బాట పడుతున్నాయి. మొన్న విడుదలైన అద్బుతం అనే చిత్రానికి హాట్ స్టార్‌లో మంచి వ్యూస్ వచ్చాయి. ఓటీటీలో ఈ చిత్రం హిట్ అయింది. చిరంజీవి కూడా అద్భుతం మీద ప్రశంసలు కురిపించాడు. ఇక ఇప్పుడు శివానీ రాజశేఖర్ రెండో చిత్రం కూడా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాట‌లు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల‌కానుంది. 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` డిజిట‌ల్ రైట్స్‌ని `సోనిలివ్` సంస్థ ఫ్యాన్సీ మొత్తానికి ద‌క్కించుకుంది. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం సోనిలివ్‌లో ప్ర‌సారం కానుందని ప్రకటించారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు దాట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మా ఫ‌స్ట్ మూవీకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్‌ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్‌ మూవీ ఇది. ఓటీటీకి ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్‌. సోనివంటి ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌తో అసోసియేట్ అవ‌డం చాలా హ్యాపీ. ఈ సినిమా సోనిలివ్ ద్వారా మ‌రింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహ‌న్‌గారి మేకింగ్, అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రి అన్ని వ‌ర్గాల‌వారిని ఆక‌ట్టుకుంటుంది అని నిర్మాత అన్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DsaG14
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...