Monday, 20 December 2021

RRR: తెరవెనుక ఎన్టీఆర్‌ కష్టం.. సెట్స్‌పై యంగ్ టైగర్ ఫీట్స్! అంచనాలకు రెక్కలు కట్టిన వీడియో

యావత్ సినీ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తోన్న సినిమా . దర్శక ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన జక్కన్న.. ఒక్కొక్కటిగా అప్‌డేట్ వదులుతూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘భీమ్‌’ రోల్ కోసం పడిన కష్టాన్ని ప్రేక్షకుల ముందుంచుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. జూనియర్‌ ఎన్టీఆర్ పోషించిన పాత్రకు సంబంధించిన సీన్స్ కట్ చేసి ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు రాజమౌళి. ‘భీమ్’ పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఎంత కష్టపడ్డారనేది ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. బైక్‌ డ్రైవింగ్‌, అడవిలో పరిగెత్తే సన్నివేశాలతో పాటు కెమెరా వెనక మాస్క్‌ పెట్టుకుని ఎన్టీఆర్ ప్రాక్టీస్‌ చేస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియో చూసిన జనం RRR మూవీలో ఎన్టీఆర్ మేకోవర్ ఊహించిన దాన్ని మించి ఉంటుందని ఫిక్సవుతున్నారు. ఇదే తరహాలో త్వరలోనే రామ్‌ చరణ్‌ పాత్రకు సంబంధించిన మేకింగ్‌ వీడియో కూడా రిలీజ్ చేయనున్నారట జక్కన్న. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోలుగా ఈ సినిమా రూపొందించారు. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ నటించగా.. కొమురం భీం రోల్ ఎన్టీఆర్ పోషించారు. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. సంగీత దిగ్గజం కీరవాణి బాణీలు కట్టారు. ఈ సినిమాపై మెగా, నందమూరి ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EfIGOP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...