Tuesday, 21 December 2021

బ్రహ్మానందంతో నిహారిక దావత్.. మీమ్స్‌పై ఫీలింగ్స్ బయటపెట్టిన కమెడియన్.. మెగా డాటర్ షాక్!

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అరచేతుల్లో ప్రపంచం కనిపించే రోజులు వచ్చేశాయి. రోజురోజుకీ సోషల్ మీడియా హవా రెట్టింపవుతూ వస్తోంది. స్మార్ట్ యుగంలో నేటి యువత సరికొత్తగా థింక్ చేస్తున్నారు. ఆదాయం మొదలుకొని ఎంటర్‌టైన్‌మెంట్ వరకు టెక్నాలజీని, సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో గడిపే వారు కొత్త కొత్త మీమ్స్ క్రియేట్ చేస్తూ నేటి సమాజంలో జరుగుతున్న ఎన్నో విశేషాలపై రియాక్ట్ అవుతున్నారు. మీమ్స్ క్రియేట్ చేస్తూ నవ్వించే వారు కొందరైతే, మీమ్స్‌తో మెసేజ్ పాస్ చేసేవారు ఇంకొందరు. ఇక అదే మీమ్స్‌తో సెటైరికల్ కామెంట్స్ చేసే వారిది ఓ ప్రత్యేకమైన వర్గం. అయితే మీమ్స్ ఎలాంటివైనా వాటన్నింటిలో హ్యాండ్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. అప్పుడే కదా అది పేలేది!. బ్రహ్మి కామెడీ టైమింగే మీమ్స్ క్రియేట్ చేసే వారికి మాంచి బూస్టింగ్. అలా అలా బ్రహ్మి లేని మీమ్స్ లేనేలేవు అన్నట్లుగా మారింది ట్రెండ్. మొన్నటి సమంత ఐటమ్ సాంగ్‌పై కూడా బ్రహ్మిని వాడేస్తూ వందలాది మీమ్స్ క్రియేట్ చేశారు. అయితే ఈ మీమ్స్ చూసుకొని బ్రహ్మానందం ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది అందరికీ ఆసక్తికర విషయమే. అందుకే ఆయన ఏ ప్రోగ్రామ్‌కి వచ్చినా ముందుగా మీమ్స్ గురించే అడుగుతున్నారు. రీసెంట్‌గా ఆలీతో సరదాగా ప్రోగ్రాం గెస్టుగా బ్రహ్మానందం రాగా మీమ్స్‌పై మీ ఏంటని ప్రశ్నించారు ఆలీ. దానిపై బదులిచ్చిన బ్రహ్మి.. ''మీమ్స్ క్రియేట్ చేసే వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. కొన్ని కారణాల వల్ల నేను సినిమాల్లో నటిచకపోయినా నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్ళే'' అంటూ క్రేజీగా రియాక్ట్ అయ్యారు. ఇకపోతే బిగ్గెస్ట్ దావత్ ఆఫ్ 2021 పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసిన జీ టీవీ దానికి బ్రహ్మానందం, నిహారికలను స్పెషల్ గెస్టులుగా తీసుకొచ్చారు. న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్‌గా ఈ ఆదివారం షో ప్రసారం కానున్న నేపథ్యంలో ప్రోమో రిలీజ్ చేయగా అందులోనూ బ్రహ్మి మీమ్స్ టాపికే దర్శనమిచ్చింది. ప్రతి రోజు ఫోన్లో మీ మీమ్స్ వస్తుంటాయి. అవి చూసి మీ ఫీలింగ్స్ ఏంటని యాంకర్ ప్రదీప్ అడగడంతో రియాక్ట్ అయిన బ్రహ్మానందం.. ఆహా ఎంత గ్లామర్‌గా ఉన్నావురా అని అనుకుంటానని చెప్పారు. దీంతో అది విని ఆశ్చర్యపోయిన తెగ నవ్వేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33ObPUE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...