Friday, 10 December 2021

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న RRR ట్రైల‌ర్ ... సరికొత్త రికార్డ్ క్రియేట్

ఎంటైర్ ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా, భారీ అంచ‌నాల‌తో ఎదురు చూస్తోన్న చిత్రం . టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న చిత్రం కూడా కావ‌డం సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు ఒక‌టైతే.. బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ వంటి వారు కూడా RRRలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌డం కూడా ఇంత‌టి అంచనాల‌కు కార‌ణాలుగా చెప్పొచ్చు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయిని బాలీవుడ్ రేంజ్‌లోనే కాదు.. ప్ర‌పంచ స్థాయిలో నిల‌బెట్టిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమా కావ‌డం మ‌రో ఎత్తు. సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమాపై ఎవ‌రూ ఊహించ‌లేనంత అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎందుకంటే రాజ‌మౌళి ఎంచుకున్న కాన్సెప్ట్ అటువంటిది మ‌రి. గోండు వీరుడు కొమురం భీమ్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు చ‌రిత్ర‌లో క‌లుసుకున్న దాఖ‌లాలు లేవు. అయితే వీరిద్ద‌రూ క‌లుసుకుని ఉండుంటే, వారి ఆలోచ‌న‌లు, భావాల‌ను ప‌రస్ప‌రం పంచుకుని.. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉండొచ్చు అనే ఊహాత్మ‌క అంశంతో RRR క‌థ‌ను త‌యారు చేయించి కేవ‌లం ఇండియన్ స్టార్స్‌తోనే కాదు.. హాలీవుడ్ స్టార్స్ అయిన రే స్టీవెన్ స‌న్, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ వంటి వారిని కూడా ఈ చిత్రంలో న‌టింప చేశారు రాజ‌మౌళి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా జ‌న‌వ‌రి 7న భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, ఆలియా భ‌ట్‌, దాన‌య్య‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌హా టీమ్ అంతా ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. గురువారం (డిసెంబ‌ర్ 9)న ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయ‌నే విష‌యం ట్రైల‌ర్ చూస్తేనే అర్థం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే ఇండియాలో మ‌రే సినిమా సాధించిన సరికొత్త రికార్డును RRR మూవీ ట్రైల‌ర్ క్రియేట్ చేసింది. ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లోనే 51.1 మిలియ‌న్ వ్యూస్‌ను సాధించింది. ఇది ఐదు భాష‌ల్లో క‌లిపి. అందులో తెలుగు - 20.23 మిలియ‌న్స్‌ హిందీ - 19.08 మిలియ‌న్స్‌ క‌న్న‌డ‌ - 5.16 మిలియ‌న్స్‌ త‌మిళం - 3.21 మిలియ‌న్స్‌ మ‌ల‌యాళం- 2.40 మిలియ‌న్స్ అంటే మొత్తంగా 51.1 మిలియ‌న్స్ వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న‌RRR ట్రైల‌ర్‌కే ఇలా రికార్డ్ క్రియేట్ చేస్తే.. ఇక సినిమా విడుద‌లైన త‌ర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాల‌ని ట్రేడ్ వ‌ర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DHfIXJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...