Monday, 13 December 2021

LATHTHI : ఇది మామూలు విషయం కాదు.. రోజంతా కానిచ్చేసిన విశాల్ టీం

ప్రస్తుతం ఒక్క హిట్ కోసం పరితపిస్తున్నాడు. అభిమన్యుడు సినిమా తరువాత మళ్లీ విశాల్‌కు హిట్ రాలేదు. టెంపర్ రీమేక్ అయోగ్య హిట్ అయినా కూడా తెలుగు వరకు అది లెక్కలోకి రాలేదు. విశాల్ చివరగా.. చక్ర, ఎనిమీ అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అవి బోల్తా కొట్టేశాయి. ఇక ఇప్పుడు విశాల్.. ఏ వినోద్ కుమార్‌ దర్వకత్వంలో అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ తాజాగా పూర్తయింది. ఈ సందర్బంగా మేకర్లు ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో విశాల్ మీసం కట్టుతో కనిపించాడు. రెండో షెడ్యూల్ చివరి రోజంతా చిత్రయూనిట్ పని చేసిందట. ఇక ఇప్పుడు యూనిట్ అంతా కూడా మూడో షెడ్యూల్ కోసం హైద్రాబాద్‌కు చేరుకుందట. ఇండియన్ టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో నలభై రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ‘లాఠీ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. చివరి రోజున విశ్రాంతి అనేది లేకుండా 24 గంటలు పని చేశామంటే నమ్మకశక్యంగా లేదు.. పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో టీం అంతా కలిసి మూడో షెడ్యూల్ కోసం హైద్రాబాద్‌కు రాబోతోన్నాం’ అని విశాల్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. లాఠీ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఇది వరకే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయట. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవుతుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rYp66X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...