Monday, 13 December 2021

లవ్ సాంగ్ పాడిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. వీడియో వైరల్

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు. ప్రొడ్యూస‌ర్‌గానే కాదు, డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఎగ్జిబిట‌ర్‌గా ఆయ‌న త‌న‌దైన మార్కును క్రియేట్ చేసుకున్నారు. నిర్మాతగా ఆయన ఎదిగిన తీరు చాలా మందికి ఆదర్శమనే చెప్పాలి. ఆయన తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో చేసే ప్రతి సినిమాలో ఇన్ వాల్వ్ అవుతుంటారు. కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల ఎంపిక..ఇలా అన్నింటిలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందువల్లనే ఆయనకు సక్సెస్ రేటు ఎక్కువని ఇండస్ట్రీలో బలమైన నమ్మకం ఉంది. ఆయన ఒకానొక సందర్భంలో తనకు సంబంధంలేని సినిమా డిపార్ట్‌మెంట్ వర్క్‌లోనూ ఇన్ వాల్వ్ అయ్యారు. ఇంతకీ ఆయన అంతలా ఇన్ వాల్వ్ అయిన డిపార్ట్‌మెంట్ ఏదో తెలుసా.. పాటలు పాడటం. గతంలో ఆయన నిర్మాతగా నాగ చైతన్య హీరోగా రూపొందిన చిత్రం ‘జోష్’.ఈ సినిమాలో డైరెక్టర్ వాసు వర్మ రిక్వెస్ట్ మేరకు దిల్ రాజు ఓ పాట కూడా పాడారు. అది వెండితెరకే పరిమితం అయ్యింది. అయితే, తొలిసారి ఆయన స్టేజ్‌పై పాట పాడారు. అది కూడా ఓ లవ్ సాంగ్. నిజమేనండి బాబూ!. అసలు దిల్ రాజు లవ్ సాంగ్ ఎక్కడ పాడారు.. ఎందుకు పాడారు? అనే వివరాల్లోకి వెళితే... కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి దిల్ రాజు సతీ సమేతంగా హాజరయ్యారట. అది ఓ హోటల్ ఓపెనింగ్.. ఈవెంట్‌ను నిర్వాహకులు ఘనంగానే జరిపారు. ఆ సమయంలో మ్యూజిక్ ప్రోగ్రామ్ జరిగింది. అందులో దిల్ రాజు గొంతు సవరించేసుకున్నారు. ఇంతకీ దిల్ రాజు పాడిన పాట ఏదో తెలుసా? టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, తన సతీమణి అమలతో కలిసి నటించిన సినిమాలోనిది. ఆ సినిమాలో ‘హలో గురూ ప్రేమ కోసమే..’ అనే సాంగ్ చాలా పెద్ద హిట్. ఆ సాంగ్‌ను దిల్ రాజు పాడిన వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రీసెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు .. తన భార్యను ఉద్దేశించే ఆ పాట పాడారనే కామెంట్స్ లేకపోలేదు. ఏదైతేనేం దిల్ రాజు మాత్రం ట్యూన్‌కి చక్కగా సాంగ్ పాడేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. దిల్ రాజు నిర్మాతగా F3, RC 15 సహా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. మరో వైపు డిస్ట్రిబ్యూటర్‌గా భారీ చిత్రాలను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. మరో వైపు తన తమ్ముడు కుమారుడు ఆశిష్ రెడ్డిని హీరోగపరిచయం చేస్తూ రౌడీ బాయ్స్ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rXHvks
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...