Monday, 13 December 2021

F3: వెంకటేష్ బర్త్ డే సర్‌ప్రైజ్.. పేకముక్కల్లా కరెన్సీ నోట్లు.. స్పెషల్ వీడియో వైరల్

గతంలో వచ్చిన F2 సినిమాకు సీక్వల్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతా కలిసి గతంలో కంటే రెట్టింపు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు అప్‌డేట్స్‌తో సినిమాపై ఆసక్తి రేకెత్తించిన చిత్రయూనిట్ నేడు (డిసెంబర్ 13) పుట్టినరోజు కానుకగా మరో అప్‌డేట్ ఇచ్చారు. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నుంచి వెంకీపై స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో చార్మినార్ వాతావరణం, అలా నవాబులా డబ్బుని చేతిలో పట్టుకుని ఊపుతూ హాయిగా కనిపించారు వెంకటేష్. తన మ్యానరిజంతో అదరగొట్టేశారు ఈ విక్టరీ హీరో. గతంలో వచ్చిన F2 సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో కమెడియన్స్ రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారు కూడా భాగమవుతుండటంతో మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. సినిమాకు ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మూడో హీరోయిన్‌గా ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ కనిపించబోతోన్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ELaziF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...