Monday, 13 December 2021

దటీజ్ ఎన్టీఆర్.. ఒక్క వాచ్ కోసమే అన్ని కోట్లు పెట్టిన యంగ్ టైగర్.. తగ్గేదే లే!!

ఒకప్పుడు వాచ్ అనేది ప్రతి ఒక్కరు చేతికి కనిపించేది. కానీ టెక్నాలజీ పెరిగి సెల్ ఫోన్స్ జేబులో చేరాక వాచ్ అటకెక్కింది. అయితే ఇప్పటికీ వాచ్ ధరించే వాళ్ళ సంఖ్య లేదని చెప్పలేం కానీ ఒకప్పటితో పోల్చితే కాస్త తగ్గింది. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా వాచ్ అనేది స్టేటస్ సింబల్‌గా వాడే రోజులొచ్చాయి. దీంతో అందరూ కూడా ఖరీదైన వాచెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో ధర ఎంతనేది బయటకు రావడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా వెలుగొందుతూ తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్.. సినిమాలపై ఎంత ఆసక్తి చూపుతూ కెమెరా ముందు సత్తా చాటుతుంటారో, లగ్జరీ లైఫ్ విషయంలోనూ అస్సలు వెనక్కు తగ్గరు. కొత్త కొత్త మోడల్స్ కార్లు కొంటూ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటారు ఎన్టీఆర్. అయితే తన వాచ్ విషయంలోనూ ఆయన అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారట. ఎన్టీఆర్‌కి అరుదైన, కాస్లీ వాచీలంటే చాలా చాలా ఇష్టమట. అందుకే కోట్లలో విలువ చేసే రిచర్డ్ మిల్లే RM 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ అనే ఖరీదైన వాచ్ ధరించారు ఎన్టీఆర్. అలా ఆ వాచ్ పెట్టుకొని తారక్ కెమెరాకు చిక్కడంతో ఆ వాచ్ ధరకు సంబంధించిన డిస్కషన్ సోషల్ మీడియాలో తెగ నడుస్తోంది. దీని ధర 39,932,395 రూపాయలని తెలుస్తోంది. అన్ని ట్యాక్స్‌లను కలుపుకొని చూస్తే దాదాపు రూ.4 కోట్లు దాటిపోతుందట. మరి తారక్ ఈ రేంజ్ వాచ్ కొన్నారంటే ఆయనకు గడియాలంటే ఎంత పిచ్చో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాల్ విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న భారీ సినిమా RRRతో బిజీగా ఉన్నారు. జనవరి 7న విడుదల అకాబోతున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు. దీని తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yksAlq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...