Saturday, 18 December 2021

పార్ట్నర్ అలా పెగ్‌ వేస్తూ ఉంటే.. భర్తతో కలిసి కాజల్ సిట్టింగ్!.. నెటిజన్ల ట్రోలింగ్

స్టార్ హీరోయిన్లు ఈ మధ్య మద్యం ప్రమోషన్స్‌లో బిజీగా మారుతున్నారు. ఒక్కో హీరోయిన్ ఒక్కో బ్రాండ్‌ను ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇలియానా, రెజీనా, పూజా హెగ్డే వంటి భామలు కూడా మద్యం బ్రాండ్ల కోసం ముందుకు వస్తున్నారు. తమ తమ స్టైల్లో యాడ్స్‌లో నటిస్తున్నారు. అయితే తాజాగా మరోసారి టీచర్స్ బ్రాండ్ కోసం ముందుకు వచ్చింది. గతంలో తన భర్తతో కలిసి కాజల్ షేర్ చేసిన ఫోటోలు, చేసిన కామెంట్లు, విస్కీ తాగండి అంటూ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. కనీస బాధ్యత లేదా? అంటూ నెటిజన్లు ఆ సమయంలో కాజల్‌ను ఏకిపారేశారు. తాజాగా మరోసారి కాజల్ తన భర్తతో కలిసి విస్కీ ప్రమోషన్స్ కోసం ముందుకు వచ్చింది. అసలే కాజల్ ఇప్పుడు గర్భవతి అని టాక్ వస్తోంది. అందుకే సినిమాలకు నో చెబుతోందట. నాగార్జున సినిమా నుంచి తప్పుకోవడానికి అదే కారణమని తెలుస్తోంది. నిర్మాత కూడా అనధికారికంగా ప్రకటించేశాడు. అలా కాజల్ ప్రెగ్నెన్సీ వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ విస్కీ ప్రమోషన్ పోస్ట్ వైరల్ అవుతోంది. కాజల్ తాజాగా టీచర్స్ విస్కీ గురించి ఓ పోస్ట్ వేసింది. మన పార్ట్నర్ ఇలా సాయంకాలం పెగ్గు కలుపుకుని తాగుతూ మన పక్కనే ఉంటే.. వీకెండ్ అలా సరదాగా గడిచిపోతోంది.. అని కాజల్ చెప్పుకొచ్చింది. బాధ్యతతో తాగండి.. 25 ఏళ్లకు పైబడిన వారికే ఇది వర్తిస్తుంది అనే కాజల్ టర్మ్స్ అండ్ కండీషన్స్ కూడా చెప్పుకొచ్చింది. ఇక కాజల్ వేసిన పోస్ట్ మీద నెటిజన్లు విరుచుకుపడుతుంది. డబ్బులు చాలడం లేదా? ఇంకా ఇలాంటివి కూడా ప్రమోట్ చేయాలా? అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3E9TX34
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...